శేరిలింగంపల్లి, నవంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ సాయిబాబా ఆలయంలో ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు నిర్వహించే నిత్యాన్నదానం కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించారు. అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం వేలాదిమంది స్వాములకు నిత్యాన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్న నిర్వాహకులపై శేరిలింగంపల్లి ప్రజలపై ఆ హరిహర పుత్రుడి దీవెనలు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ లేబర్ సెల్ చైర్మన్ నల్లా సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, కృష్ణ ముదిరాజ్, ప్రవీణ్ గౌడ్, శేఖర్ ముదిరాజ్, ప్రవీణ్, పద్మా రావు, లక్ష్మణ్, ఆంజనేయులు యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సాయి యాదవ్, కృష్ణ గౌడ్, సంగారెడ్డి, శేఖర్ యాదవ్, మస్తాన్, శ్రీను, రాము, కృపాకర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, జగన్ మోహన్, మల్లికార్జున్, శ్రీనివాస్ రెడ్డి, బాలరాజు ముదిరాజ్, రాజ్, అశోక్, భాస్కర్, బాలకృష్ణ, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.