శేరిలింగంపల్లి, అక్టోబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) లో భాగంగా చందానగర్ సర్కిల్ లోని Dr.BR అంబేద్కర్ కళ్యాణ మండపంలో సుపర్ వైజర్లు, ఎన్యుమరేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పి.మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఇంటింటి సర్వే కార్యక్రమానికి సర్కిల్ లో ఉన్న సుమారు ఒక లక్ష పై చిలుకు కుటుంబాలకు ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ ను, ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ లాగా క్షేత్ర స్థాయి లో విధులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు.
వచ్చే నెల 6 నుండి 18 తేదీ వరకు 13 రోజుల్లో ఈ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే ను రెండు విడతల్లో చేయాలని మొదటి విడతలో తమకు కేటాయించిన కుటుంబాలను గుర్తించి ఇంటి నంబరు వగైరా వివరాలను నమోదు చేసుకుని వారి ఇంటికి స్టిక్కర్ ను అతికించాలని, రెండవ విడతలో కుటుంబ సభ్యుల అందరి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులము వివరములు జాగ్రత్తగా మార్గదర్శక పుస్తకంలో సూచించిన ప్రకారం పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని అన్నారు.
ప్రతి రోజు సంబంధిత సూపర్వైజర్లు పది శాతం ఎన్య్యూమరేటర్ల నమోదును క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి ఎన్యుమరేటర్లకు తగు మార్గదర్శకత్వం చేయాలని అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ అవగాహన సమావేశంలో సర్కిల్ EE రాజు, ఏసీపీ నాగిరెడ్డి, వైద్యాధికారి రవి, ప్రాజెక్టు అధికారిణి ఉషా రాణి, DE లు స్రవంతి, దుర్గా ప్రసాద్, AE లు ప్రతాప్, ప్రశాంత్, సంతోష్ రెడ్డి, పారిశుద్య అధికారి శ్రీనివాస్, సర్కిల్ Srp లు, Sfa లు, RPలు, ఎంటమాలజీ, అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
కాగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ సర్కిల్లో మొత్తం 91,598 కుటుంబాలు ఉండగా 611 ఎన్యుమరేషన్ బ్లాక్స్ ఉన్నాయి. మొత్తం 114 మంది ఎన్యుమరేటర్లు పనిచేస్తారు. వీరికి శిక్షణ ఇచ్చారు. మొత్తం 61 మంది సూపర్వైజర్లను నియమించారు. బుధవారం 25 మంది సూపర్ వైజర్లకు శిక్షణ ఇచ్చారు.