కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీ కి చెందిన రజిత అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా.. రూ. 2 లక్షల 30 వేలు మంజూరయ్యాయి. సీఎంఆర్ఎఫ్ ఎల్వోసి నుంచి మంజూరైన నిధులకు సంబంధించిన మంజూరి పత్రాన్ని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయనిధి ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా నిలబడుతున్నదన్నారు. వైద్య చికిత్సకి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి బాధితుల కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాశీనాథ్ యాదవ్, అశోక్ పాల్గొన్నారు.