వాడ‌వాడ‌లా ఉత్సాహంగా విజ‌య‌ద‌శ‌మి వేడుక‌లు

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలో విజ‌య‌ద‌శ‌మి వేడుకలు ఆదివారం ఘ‌నంగా జ‌రిగాయి. క‌రోనా వ్యాది విస్త‌ర‌ణ నేప‌థ్యంలో కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ సాంప్ర‌దాయ బ‌ద్దంగా ఉత్స‌వాలు నిర్వ‌హించారు. ప్ర‌తి సంవ‌త్స‌రం మాదిరిగానే వాడ‌వాడ‌లా శ‌మీ పూజ‌లు ఉత్సాంగా నిర్వ‌హించారు. అనంత‌రం ప్ర‌జ‌లు జ‌మ్మి ప‌త్రాల‌ను మార్చుకుంటూ ప‌ర‌స్ప‌రం శుభాకాంక్ష‌లు తెలుపుకున్నారు. ప్ర‌జాప్ర‌తినిధులు, వివిధ పార్టీల నాయ‌కులకు అభిమానులు శుభాకాంక్ష‌లు తెలిపారు.

చందానగర్ జవహర్ కాలనీలో జమ్మి పూజలో పాల్గొన్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, సురేష్ దంప‌తులు
హుడా ట్రేడ్ సెంట‌ర్ రామాల‌యంలో జ‌మ్మిచెట్టుకు పూజ‌లు నిర్వ‌హిస్తున్న రాష్ట్ర సాంఘీక‌సంక్షేమ బోర్డు చైర్‌ప‌ర్స‌న్ రాగం సుజాత యాద‌వ్‌, శేరిలింగంప‌ల్లి కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్ దంప‌తులు
గంగారం గ్రామంలో శ‌మీపూజ‌లో పాల్గొన్న గ్రామ‌స్తులు
చందాన‌గ‌ర్ వెంక‌టేశ్వ‌రాల‌యంలో జ‌మ్మి చెట్టుకు పూజ‌లు నిర్వ‌హిస్తున్న ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ సుద‌ర్శ‌నం స‌త్య‌సాయి
ఖాజాగుడాలో శ‌మీ పూజ నిర్వ‌హిస్తున్న టీఆర్ఎస్ నాయ‌కుడు కొమ‌ర‌గౌని సురేష్ గౌడ్ త‌దిత‌రులు
లింగంప‌ల్లి గ్రామంలో సాంప్ర‌ద‌యం ప్ర‌కారం శమిపూజ‌కు బ‌య‌లుదేరిన గ్రామ‌స్థులు
మాతృశ్రీన‌గ‌ర్‌లో జ‌మ్మి చెట్టుకు పూజ‌లు నిర్వ‌హిస్తున్న కాల‌నీ వాసులు
శిల్పఎన్‌క్లేవ్ శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌య ప్రాంగ‌ణంలో భౌతిక దూరం పాటిస్తు ద‌స‌రా వేడుక చూస్తున్న పుర ప్ర‌ముఖులు
క‌రోనా నేప‌థ్యంలో గంగారం గ్రామంలో ఇంటివ‌ద్దే చిన్న‌పాటి రావణాసుర ప్ర‌తిమ‌ను ద‌హ‌నం చేస్తున్న బాలుడు
ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీకి పండ‌గ శుభాకాంక్ష‌లు తెలుపుతున్న టీఆర్ఎస్ నాయ‌కుడు ఉరిటి వెంక‌ట్రావు, హోప్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ కొండా విజ‌య్‌కుమార్‌
మాదాపూర్ కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్న న‌ల్ల‌గండ్ల గ్రామ ప్ర‌ముఖులు
కొండాపూర్ శ్రీరామ్‌న‌గ‌ర్‌లో ద‌స‌రా సంద‌ర్భంగా అమ్మ‌వారి పూజ‌ల్లో పాల్గొన్న స్థానిక వార్డు మెంబ‌ర్ చాంద్‌పాషా
హుడా కాలనీ సాయిబాబా దేవాలయంలో శమీ పూజ లో పాల్గొన్న సిఐటియు నాయకుడు కొంగర కృష్ణ తదితరులు
Advertisement

2 COMMENTS

  1. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలతో …. నమస్తే slp దినదిన అభివృద్ది చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here