నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ మీడియా రాష్ట్ర కో ఆర్డినేటర్ గా టి. కవికుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు యూత్ కాంగ్రెస్ మీడియా నేషనల్ ఇంచార్జీ రాహుల్ రావు నియామకపు పత్రాన్ని అందజేశారు. టి. కవికుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ చేపట్టనున్న కార్యక్రమాలను ప్రజలకు ఎప్పటికప్పుడు కృషి చేస్తామన్నారు. ప్రజా సమస్యలపై పోరాడి అవగాహన కల్పిస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన నేషనల్ ఇంచార్జీ రాహుల్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.