ధర్మపురి క్షేత్రంలో ఆకట్టుకున్న గుడి సంబరాలు – హాజరైన అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: మహాశివరాత్రి పర్వదినాన ధర్మపురి క్షేత్రంలోని ఆలయాన్ని సందర్శించుకోవడం సంతోషకరంగా ఉందని తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు‌. దీప్తీశ్రీనగర్ లోని ధర్మపురి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వాహకురాలు భారతీయం సత్యవాణి ఆధ్వర్యంలో గుడి సంబరాలు ఘనంగా జరిగాయి. శివోహమ్ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. సుప్రసిద్ద సంప్రదాయ నృత్య నికేతనం యామినీ రెడ్డి బృందం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. ఈ‌ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. శివరాత్రి రోజున శివోహమ్ కార్యక్రమంతో కళ్లకు‌ కట్టినట్లు కళాకారులు ప్రదర్శించిన నృత్యరూపకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. పద్మ భూషణ్ డా. రాజా రాధారెడ్డి ఆధ్వర్యంలో గుడి సంబరాలు జరిపారు. ఆలయం ఆవరణలో అద్భుత గీతాలు, దీపోత్సవ అలంకరణలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ధర్మపురి క్షేత్రంలో అలంకరణలతో శివలింగం
ధర్మపురి క్షేత్రంలో కళాకారుల నృత్యప్రదర్శనలను తిలకిస్తున్న స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి, సత్యవాణి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here