తండ్రి మందలించాడని ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

నమస్తే శేరిలింగంపల్లి: తండ్రి మందలించాడని కోపంతో ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాపిరెడ్డి కాలనీ వాటర్ ట్యాంకు వద్ద గల ప్లాట్ నంబర్ 3, రూమ్ నంబర్ 7 లో జి. వందనం మేస్త్రీ పని చేసుకుంటూ కొడుకు గద్దెల రాజేష్ (25), కోడలు, కుటుంబ సభ్యులతో జీవిస్తున్నాడు. ఈ‌ నెల‌14 వ తేదీన రాత్రి రాజేష్ తన భార్యతో గొడవపడడంతో తండ్రి వందనం మందలించాడు. కోపంతో రాజేష్ ఇంటి‌ నుంచి అదే రాత్రి బయటకు వెళ్లిపోయాడు. ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో చుట్టు పక్కలా ఎంత వెతికినా ఆచూకీ‌ లభించకపోవడంతో చందానగర్ పోలీసులను ఆశ్రయించారు. తండ్రి‌ వందనం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాజేష్ ఎత్తు 5.3 ఫీట్లు, నలుపు రంగు, కోల మొహం కలిగి ఉన్నాడన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో నలుపు రంగు చొక్కా, షార్ట్ నెక్కర్ ధరించి ఉన్నాడన్నారు. ఆచూకీ తెలిసిన వారు చందానగర్ పోలీస్ స్టేషన్, 7901113092, 04027853911, 9490617100, 100 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

అదృశ్యమైన రాజేష్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here