చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజక వర్గం పరిధిలోని చందానగర్ డివిజన్ లో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రఘుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డి, మాజీ కౌన్సిలర్లు రాఘవేంద్ర రావు, సునీత రెడ్డి, డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, తెరాస నాయకులు మిరియాల రాఘవరావు, ఉట్ల కృష్ణ, జేరిపాటి రాజు, దాసరి గోపి, లక్ష్మారెడ్డి, జనార్దన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రామచంద్ర రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ప్రవీణ్, ప్రభాకర్ రెడ్డి, శ్రీను, మిరియాల ప్రీతమ్, పొడుగు రాంబాబు, శివ, గౌస్, ఆశిల శివ, జహీర్ తదితరులు పాల్గొన్నారు.