నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ 87 వ జయంతి ని పురస్కరించుకుని శుక్రవారం శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ జోనల్ కార్యాలయంలో జయంతి వేడుకలను నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ వెంకన్నతో కలిసి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంహెచ్ఓ డాక్టర్ రవి కుమార్, ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈ సుదర్శన్ , డీఈ శ్రీనివాస్, ఏఈ లు కృష్ణ వేణి , సునీల్ , శానిటేషన్ సూపర్ వైజర్ జలందర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.