- కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రైలు విహార్ కాలనీలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇళ్లల్లోకి నీరు చేరి నష్టపోయిన బాధిత కుటుంబాలకు శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, యువజన నాయకుడు రాగం అనిరుద్ యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన తక్షణ సహాయం రూ. 10 వేలను అందజేశారు. మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రవేశపెడుతున్నారని రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ముంపు బాధితులకు పెద్ద దిక్కులా ఇంటింటికి రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి ఆదుకుంటున్నారని అన్నారు. సురభికాలనీలో ముంపు బాధితులకు తక్షణ సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.
మసీదుబండలో…
వర్షం ముంపు బాధితులకు తక్షణ సహాయం కింద ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికి రూ. 10 వేల చొప్పున అందజేసి బాసటగా నిలుస్తున్నారని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. మసీద్ బండ లోని వడ్డెరుల గుడిసెలు వరద కారణంగా కొట్టుకుపోవడం, నీళ్లు వచ్చి చేరడంతో వారి కుటుంబాలకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కష్టాలు తెలిసిన మనిషి అని, వరద బాధితులు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు అధికారులతో, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ సహాయక చర్యలు చేపట్టారని రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. తక్షణ సహాయం కింద రూ. 10వేలు ఆర్థిక సహాయాన్ని అందజేసి వారి కళ్లల్లో ఆనందాన్ని నింపుతున్నారని అన్నారు.