నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కలిసి ఉద్యమం చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉద్యమకారులు ఏకమవుతున్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్ లో గల ఆర్ఎంపి డాక్టర్, ఉద్యమకారుడు రమేష్ ను సోమవారం తోటి ఉద్యమకారులు కలిశారు. ఉద్యమకారులమంతా ఏకతాటిపై ఉండి బంగారు తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉద్యమకాలంనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సంగారెడ్డి, నిమ్మల శేఖర్ గౌడ్, షేక్ జమీర్, మిద్దెల మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.