నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్‌మోహర్ పార్కు కాలనీలో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ శేరిలింగంపల్లి శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన MD 320 ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్స్ బ్యాంక్‌ను ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూగి గాంధీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వారు ఆపదలో ఉన్న వారిని అడ్డుకోవడంతో ఎప్పుడూ ముందుంటారని, లయన్స్ క్లబ్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. సామాజిక దృక్పథంతో సేవ చేయడానికి ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్ వారి ఔదార్యం ఎంతో గొప్పదని, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం అభినదించదగ్గ విషయమని అన్నారు. కరోన వంటి విపతర్క పరిస్థితులలో ఆక్సిజన్ అవసరమగు రోగులకు ఈ పరికరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, LCIF ఏరియా లీడర్ లయన్ బాబూరావు, డిస్ట్రిక్ట్ గవర్నర్లు సూర్యారాజు, రామకృష్ణ రెడ్డి, ఫస్ట్ వైస్ గవర్నర్ శ్రీనివాస్, శేరిలింగంపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సుబ్బారావు, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్, గచ్చిబౌలి డివిజన్ తెరాస అధ్యక్షులు రాజు నాయక్, చందానగర్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ, అన్వర్ షరీఫ్, ప్రతాప్ రెడ్డి, యాదగిరి గౌడ్, జనార్దన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, చెన్నం రాజు, కరుణాకర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి , సురేందర్, ఖాసీం, మల్లేష్ వినోద్, యాదగిరి, రాజేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.