నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ,బస్తీలో ప్రజలకు మెరుగైన మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా పని చేస్తున్నామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. సోమవారం హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మంజీరా రోడ్డులో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను కాలనీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ ఎన్ క్లేవే కాలనీ అధ్యక్షుడు ఆంజనేయ రాజు, జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.