నిర్మాణాలకు అనుమతులు ఇప్పించండి – ప్రభుత్వ విప్ గాంధీకి డైమండ్స్ హిల్స్ కాలనీ వాసుల వినతి

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని డైమండ్ హిల్స్ కాలనీ లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నా పలు కారణాలు చూపుతూ జీహెచ్ఎంసీ అధికారులు నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదని, కాలనీలో నిర్మాణాలు చేపట్టేందుకు సహకరించాలని కాలనీ వాసులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి విజ్ఞప్తి చేశారు.

డైమండ్ హిల్స్ కాలనీ వాసులతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్

డైమండ్ హిల్స్ కాలనీ వాసులు పలు సమస్యలపై స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నిర్మాణ అనుమతుల పై సాధ్య సాధ్యాలను పరిశీలించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి సహకరిస్తానని చెప్పారు. కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పారు. అందరి కృషి తో ఆదర్శవంతమైన కాలనీగా మారుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డైమండ్ హిల్స్ కాలనీ వాసులు మోహన్ రావు , ఉపేందర్ రెడ్డి, కిరణ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, కుటుంబ రావు, బషీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ గాంధీకి తమ సమస్యలను వివరిస్తున్న డైమండ్ హిల్స్ కాలనీ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here