శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ కాలనీ గిడ్డంగి ప్రాంతంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మంగళవారం పర్యటించారు. స్థానికంగా రహదారిపై డ్రైనేజీ నీరు ప్రవహిస్తుందని, సమస్యను పరిష్కరించాలని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆయన డ్రైనేజీని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తారానగర్ బస్తీ వార్డు మెంబర్ కవిత గోపి, స్థానికులు కొత్త నవీన్, కొత్త వెంకటేశం, కట్కామ్ వెంకటేష్, నాయకులు బస్వరాజు, గణపురం రవీందర్, పట్లోళ్ల నర్సింహారెడ్డి, నటరాజ్, రాజు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.