శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): సురభికాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన యూత్ భవనాన్ని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. యువకుల కోసం కాలనీలో ఆట స్థలాన్ని అభివృద్ధి చేసి పూర్తి స్థాయిలో క్రీడా సామాగ్రి, ఓపెన్జిమ్ ను ఏర్పాటు చేయించి అందుబాటులోకి తీసుకువచ్చే లా కృషి చేస్తానని రాగం నాగేందర్ యాదవ్ చెప్పారు. అనంతరం కార్పొరేటర్ గా గెలిచిన శుభసందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన కేకును రాగం నాగేందర్ యాదవ్ కట్ చేశారు. మరోసారి తన విజయానికి కృషి చేసిన యువతకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు రాగం అనిరుద్ యాదవ్, వార్డు మెంబర్ శ్రీకళ, కాలనీ అధ్యక్షుడు కోదండరాం, యువజన కమిటీ మాజీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, నూతన అధ్యక్షుడు చిరంజీవి, కార్తీక్, మోహన్, రవి, శరత్ పాల్గొన్నారు.