నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ ఎక్స్ రోడ్ బీజేపీ కార్యాలయం వద్ద స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన సమరయోధులు కలలు కన్న చెల్లించగల అత్యంత అర్ధవంతమైన నివాళి భారతదేశాన్ని నిర్మించడమే అసలైన నివాళి అన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, పట్టణ-గ్రామీణ విభజన, కుల, లింగ వివక్ష లేకుండా ఉండాలని అని అన్నారు. జాతిపిత గాంధీజీని స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రపంచంలోనే భారతదేశం అగ్ర దేశంగా తీర్చిదిద్దడంలో అదే ఉద్యమ స్పూర్తితో పనిచేద్దాం అని అన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి, మనోహర్, శ్రీధర్ రావు, మాణిక్ రావు, రాంరెడ్డి, రవి గౌడ్, స్వాతి, కోటేశ్వరరావు, నారాయణరెడ్డి, బాబు రెడ్డి, లక్ష్మణ్, కళ్యాణ్, రామకృష్ణ, పృథ్వి కాంత్, పవన్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.