నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా పనిచేస్తున్నామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.శనివారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య కాలనీలో స్థానికులతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని అన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను, స్థానికంగా నెలకొన్న సమస్యలను బస్తి సభ్యులతో కలిసి పరిశీలించారు. మంజూరైన పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఆదిత్య నగర్ టీఆర్ఎస్ బస్తి అధ్యక్షుడు మునాఫ్ ఖాన్, కృష్ణ కాలనీ టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు ముక్తార్, మాదాపూర్ డివిజన్ మైనారిటీ అధ్యక్షుడు ఎం.ఏ.రహీమ్, ఆదిత్య నగర్ మహిళ అధ్యక్షురాలు పర్వీన్, ఆదిత్య నగర్ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ఖాజా, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు షేక్ ఖాజా, మైనారిటీ నాయకులు బాబుమియా, సలీం, లియకత్, మియాన్, మనికప్ప, షోయబ్, యూత్ నాయకులు బష్రత్, మొహమ్మద్, మాదాపూర్ డివిజన్ మహిళ కమిటీ జనరల్ సెక్రెటరీ స్నేహ, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.