కళాకారులకు అండగా నిలిచిన హోప్ కొండా విజయ్

నమస్తే శేరిలింగంపల్లి: కరోనా కష్టకాలంలో కళాకారులను‌ తమ‌‌ కళల‌ పట్ల ప్రోత్సహించి ఆర్థికంగా ఆదుకోవాల్సిన‌ అవసరం ఎంతైనా ఉందని హోప్ ఫౌండేషన్ ‌చైర్మన్ కొండా విజయ్ పేర్కొన్నారు.రవీంద్రభారతి లో నాటక ప్రదర్శన చేస్తున్న మహేష్ కళా బృంధానికి హోప్ ఫౌండేషన్ చైర్మన్‌ కొండా విజయ్ ఆదివారం రూ. 5 వేల ఆర్థిక సహాయం చేస్తూ చెక్కును అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ ఇబ్బందులు పడుతున్న కళ కారులను ఆదుకోవడం కోసం ప్రతిఒక్కరు ముందుకు రావాలని కొండా విజయ్ పిలుపునిచ్చారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన పలువురు కళాకారులకు చేయూతనందించడం జరుగుతుందని చెప్పారు.

కళాకారులకు చెక్కు అందిస్తున్న హోప్ ఫౌండేషన్ ‌చైర్మన్ కొండా విజయ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here