అకస్మాత్తుగా స్పృహ త‌ప్పి వ్య‌క్తి మృతి

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): అక‌స్మాత్తుగా స్పృహ కోల్పోయిన ఓ వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. కోల్‌క‌తాకు చెందిన ప్రంతీక్ చ‌ట‌ర్జీ (32), శ్వేత సుబ్ర‌సెన్‌లు దంప‌తులు. వీరు స్థానికంగా ప్రైవేటు జాబ్స్ చేస్తూ శేరిలింగంప‌ల్లిలోని న‌ల్ల‌గండ్ల అప‌ర్ణ స‌రోవ‌ర్ జెనిత్ అపార్ట్‌మెంట్‌లో సి-2007 ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు.

ప్రంతీక్ చ‌ట‌ర్జీ (ఫైల్‌)

కాగా ప్రంతీక్ గ‌త 3 రోజుల నుంచి గ్యాస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ పాన్ డి అనే ఇంగ్లిష్ మెడిసిన్‌ను డాక్ట‌ర్ స‌ల‌హా లేకుండానే వాడుతున్నాడు. ఈ క్ర‌మంలోనే ఈనెల 22వ తేదీన ఉదయం 9:15 గంట‌ల స‌మ‌యంలో ప్రంతీక్ అక‌స్మాత్తుగా కుప్ప‌కూలి స్పృహ త‌ప్పాడు. దీంతో కుటుంబ స‌భ్యులు వెంట‌నే అత‌న్ని స‌మీపంలో ఉన్న న‌ల్ల‌గండ్ల సిటిజెన్ హాస్పిట‌ల్‌కు చికిత్స నిమిత్తం త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే అత‌ను మృతి చెందాడ‌ని వైద్యులు నిర్దారించారు. ఈ మేర‌కు స‌మాచారం అందుకున్న పోలీసులు ప్రంతీక్ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here