ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి చెరువులో శవమై

నమస్తే శేరిలింగంపల్లి: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తి చెరువులో శవమై కనిపించాడు. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మియాపూర్ పోలీసుల కథనం ప్రకారం తూపల్లి ఆంజనేయులు (29) ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ మియాపూర్ లోని జనప్రియ వెస్ట్ సిటీలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 13వ తేదీన సాయంత్రం సమయంలో ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లిపోయి తిరిగి రాలేదు. గతంలోనూ ఇలా పలుమార్లు ఇంటి నుంచి వెళ్లిపోయేవాడు. ఆంజనేయులుపై మియపూర్ పోలీస్ స్టేషన్ లో ఒకసారి మిస్సింగ్ ఫిర్యాదు అందింది. ఈ నెల 13వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆంజనేయులు తిరిగి మళ్ళీ ఇంటికి రాలేదు. ఈ నెల 15న మియాపూర్ చెరువులో శవమై కనిపించాడు. మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు వెళ్లి విచారించినట్లు తెలిపారు. మృతుడి సోదరుడు శ్యామబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల గాని, ఇతర కారణాల వల్ల చెరువులో పడి మృతిచెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చెరువులో లభ్యమైన ఆంజనేయులు మృతదేహం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here