బాలిక‌ను వేధించిన యువ‌కుడికి 2 ఏళ్ల జైలు శిక్ష

సైబ‌రాబాద్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): త‌న‌ను ప్రేమించాలంటూ ఓ బాలిక వెంట‌ప‌డుతూ వేధింపుల‌కు గురి చేస్తున్న ఓ యువ‌కుడికి న్యాయ‌మూర్తి 2 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఈ కేసుకు సంబంధించి వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. మైలార్‌దేవ‌ప‌ల్లిలోని కాటేదాన్‌కు చెందిన కె.దుర్గా ప్ర‌సాద్ (19) అదే ప్రాంతానికి చెందిన ఓ బాలిక (16) ను వేధింపుల‌కు గురి చేసేవాడు. త‌న‌ను ప్రేమించాల‌ని, త‌న‌కు ఆమె ఫోన్ నంబ‌ర్ ఇవ్వాల‌ని ఆమెను నిత్యం వేధించ‌సాగాడు. ఈ క్ర‌మంలోనే ప‌లుమార్లు ఆ బాలిక‌, ఆమె కుటుంబ స‌భ్యులు ఆ యువ‌కున్ని హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికీ అత‌ను ప్ర‌వ‌ర్త‌న మార్చుకోలేదు. ఆమెను అలాగే వేధింపుల‌కు గురి చేసేవాడు. ఈ క్ర‌మంలో బాలిక కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు అత‌న్ని అరెస్టు చేసి ప‌లుమార్లు మెజిస్ట్రేట్ ఎదుట హాజ‌రు ప‌రిచారు. ఈ క్ర‌మంలో అత‌ను చేసిన నేరం నిర్దార‌ణ కావ‌డంతో సోమ‌వారం అత‌నికి ఎల్‌బీ న‌గ‌ర్ 11వ అద‌న‌పు కోర్టు న్యాయ‌మూర్తి ఆర్‌.ర‌ఘునాథ్ రెడ్డి పోక్సో చ‌ట్టం కింద 2 ఏళ్ల జైలు శిక్ష‌, రూ.1వేయి ఫైన్ విధించారు. దీంతో నిందితున్ని పోలీసులు శిక్ష నిమిత్తం జైలుకు త‌ర‌లించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here