సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు చోట్ల ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘించి పట్టుబడిన వాహనదారులకు న్యాయమూర్తి జైలు శిక్ష, జరిమానా విధించారు. ఈ నెల 16వ తేదీన మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడగా వారికి ఒక్కొక్కరికి రూ.10వేల ఫైన్‌తోపాటు వారం రోజుల జైలు శిక్షను విధించారు. అలాగే మైనర్‌కు వాహనం ఇచ్చిన వాహనం యజమానికి 2 రోజుల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధించారు. గురువారం గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ముగ్గురు వ్యక్తులు పట్టుబడగా వారికి ఒక్కొక్కరికి రూ.15వేల ఫైన్‌తోపాటు 3 రోజుల జైలు శిక్ష విధించారు. కాగా వారందరికీ కూకట్‌పల్లి 11వ స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శిక్షలు విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ మేరకు సైబరాబాద్ కమిషనరేట్‌లోని మాదాపూర్ ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ వివరాలను వెల్లడించారు.