భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారనికి కృషి చేస్తా: ఉప్పల ఏకాంత్ గౌడ్

డ్రైనేజీ సమస్యపై స్థానికులతో మాట్లాడుతున్న ఉప్పల ఏకాంత్ గౌడ్

వివేకానందనగర్(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ ఆర్పీ కాలనీలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని బిజెపి నాయకుడు ఉప్పల ఏకాంత్ గౌడ్ అన్నారు. డ్రైనేజీ సమస్య పై స్థానికుల ద్వారా ఫిర్యాదులు అందుకున్న ఆయన బుధవారం బిజెపి నాయకులతో కలిసి కాలనీలో పర్యటించారు. రోడ్ మధ్యలో వేయాల్సిన డ్రైనేజీ పైపులైన్లను కాంట్రాక్టర్లు మధ్యలో బండరాళ్లు అడ్డుగా రావడంతో అసంపూర్తిగా పనులు పూర్తి చేశారని, దీని కారణంగా పాత పైప్ లైన్ల డ్రైనేజీ మురుగుపొంగి రోడ్లపై పారుతుందని స్థానికులు వివరించారు. ఈ విషయంపై స్పందించిన ఉప్పల ఏకాంత్ గౌడ్ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి డ్రైనేజీ పైప్లైన్ పనులు పూర్తి చేసే విధంగా చూస్తానని బస్తీ వాసులకు హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో బస్తివాసులుకళ్యాణ్, సిద్దయ్య, మల్లేష్ నాయకులు రమేష్ , అశోక్, నరేష్ ,అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here