చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి ఎంఐజీలోని సంకల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ లో కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమి క్రిస్మస్ వేడుకలకు ముఖ్యఅతిథులుగా చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు ఆదర్శ్ రెడ్డి హాజరయ్యారు. మంజుల రఘునాథ్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డిలను స్థానికులు సన్మానించారు. ఈ సందర్భంగా సెమి క్రిస్మస్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మంజుల రెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అన్ని మతాల వారిని టిఆర్ఎస్ ప్రభుత్వం గౌరవిస్తుందని అన్నారు. ప్రభుత్వం క్రిస్టియన్ లకు స్మస్ కానుకలను ప్రతి సంవత్సరం అందజేయడం జరుగుతుందన్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ అంథోనీ, నాథనియల్, టీఆర్ఎస్ నాయకులు గురు చరణ్ దూబే, రవీందర్ రెడ్డి, గిరి, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.