శేరిలింగంపల్లి, అక్టోబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): పీఆర్టీయూ టీఎస్ (PRTU TS) రాష్ట్ర 6వ కౌన్సిల్ సమావేశాలు అక్టోబర్ 16న నల్గొండలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన రాష్ట్రస్థాయి ఎన్నికల్లో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా భిక్షంగౌడ్, ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో జిన్నారం మండలానికి చెందిన మొగులయ్య, బ్రహ్మఋషి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా సత్యనారాయణ, త్రిశూల్నాథ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

జిన్నారం మండలానికి చెందిన ఉపాధ్యాయ నాయకులకు రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు దక్కడం పట్ల మండల పీఆర్టీయూ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సహకరించిన జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి విఠల్‌రెడ్డికి జిన్నారం మండల పీఆర్టీయూ పక్షాన అధ్యక్షుడు అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శి పవన్‌రాజు కృతజ్ఞతలు తెలిపారు.





