శేరిలింగంపల్లి, నవంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు చోట్ల ఫుట్ పాత్ ఆక్రమణలను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్ రోడ్డు నుంచి మసీదు బండ వరకు, మై హోమ్ మంగళ రోడ్డులో రహదారులకు ఇరువైపులా వెలసిన ఫుట్‌పాత్ ఆక్రమణలను ఎస్ఐ జి.రమేష్ ఆధ్వర్యంలో తొలగించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ట్రాఫిక్ సజావుగా సాగేందుకు పౌరులు సహకరించాలని కోరారు. ఈ మేరకు ఫుట్‌పాత్ ఆక్రమణదారులకు చలాన్లను విధించడంతోపాటు వస్తువులను సీజ్ చేశామని తెలిపారు.






