కొండాపూర్ స్వతంత్ర అభ్యర్థి హరీష్ సాగర్ కు మద్దతు తెలిపిన సగర సంఘం సభ్యులు

సగర సంగం నేతలతో సమావేశం లో మాట్లాడుతున్న ఆంజనేయులు సాగర్

కొండాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న హరీష్ సాగర్ కు స్థానిక సగర సంఘం సభ్యులు మద్దతు ప్రకటించారు. ఆదివారం సగర సంఘం నాయకులతో సమావేశమైన బిజెపి సీనియర్ నాయకులు, హరీష్ సాగర్ తండ్రి ఆంజనేయులు సాగర్ ఎన్నికల్లో మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా ఆంజనేయులు సాగర్ మాట్లాడుతూ తాను గత ఇరవైయేళ్ళుగా బీజేపీ పార్టీలో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయడం తో పాటు స్థానిక ప్రజల సమస్యల పరిష్కారం కోసం విశేషంగా కృషి చేసానని తెలిపారు. ప్రస్తుతం సగర సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు తెలిపారు. పార్టీకి విశేషంగా సేవ చేసినప్పటికీ టికెట్ ఆశించిన తనకు నిరాశే మిగిలిందని అందువల్లనే తన కుమారుడు హరీష్ సాగర్ ను ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గా బరిలో నిలిపానని తెలిపారు. సగర సంఘం సభ్యులంతా హరీష్ సాగర్ విజయానికి తోడ్పాటునివ్వాలని ఆయన కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here