మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి సాయిబాబా, రంగారావు ఆహ్వానం

శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు కొమిరిశెట్టి సాయిబాబా, మాధవరం రంగారావు ఆహ్వానించారు. ఈ నెల 24 న ఆదివారం జరగనున్న శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, మహేశ్వరం శాసనసభ్యురాలు పట్లోళ్ల సబితా ఇంద్రా రెడ్డిని కృష్ణ నగర్ లోని ఆమె నివాసంలో క‌లిసి ఆహ్వానం అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాధవరం రంగారావు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here