భారీ వ‌ర్షాల‌కు ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, జూలై 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల‌ని, అత్యవసరం అయితే త‌ప్ప ఎవరూ బయటకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సూచించారు. భారీ వర్షాల పట్ల ప్రజలందరూ అప్రమత్రంగా ఉండాలని , వర్షాల వల్ల ఎటువంటి సమస్యలు ఎదురైన త‌మ‌ దృష్టికి తీసుకురావాలని అన్నారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, GHMC అధికారులు, మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ , డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, ప్రజలు అభద్రతకు లోను కాకుండా ధైర్యంగా ఉండాలని, వర్షాలు పడుతున్న సమయంలో ఇంటి నుండి బయటకి రాకుండా ఉండాలని తప్పని పరిస్థితుల్లో బయటకి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అధికారులు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాలు , నీరు నిల్వ ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కల‌గ‌కుండా చూడాలని, అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here