శేరిలింగంపల్లి, అక్టోబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా CMRF ద్వారా మంజూరైన రూ.1,20,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను బాధిత కుటుంబాలకి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బ్రిక్ శ్రీనివాస్, పోతుల రాజేందర్, MD ఇబ్రహీం, అనిల్, సాంబయ్య, శ్రీహరి, పద్మ తదితరులు పాల్గొన్నారు.