జగదీశ్వర్ గౌడ్, SKY ఆధ్వర్యంలో ఘ‌నంగా బ‌తుక‌మ్మ సంబురాలు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 7 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని చందాన‌గ‌ర్ పీజేఆర్ స్టేడియంలో హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ కార్పొరేట‌ర్ పూజిత‌, నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్, శ్రీ‌కృష్ణ యూత్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో బ‌తుకమ్మ సంబురాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.

బ‌తుక‌మ్మ ఉత్స‌వాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న మ‌హిళ‌లు

ఈ కార్య‌క్ర‌మంలో మ‌హిళ‌లు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగు రంగుల పుష్పాల‌తో పేర్చిన బ‌తుకమ్మ‌ల‌ను అంగ‌రంగ వైభ‌వంగా తీసుకువ‌చ్చి ఒక్క చోట చేర్చి బ‌తుక‌మ్మ‌లు ఆడుతూ పాట‌లు పాడుతూ నృత్యాలు చేస్తూ సంద‌డి చేశారు.

మ‌హిళ‌ల‌తో క‌ల‌సి బ‌తుక‌మ్మ ఆడుతున్న పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన బ‌తుక‌మ్మ పోటీల్లో గెలుపొందిన విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు. ఉత్త‌మ బ‌తుక‌మ్మ‌, ల‌క్కీ డ్రా విజేత‌ల‌కు సైబ‌రాబాద్ షీ టీమ్స్ సీఐ సునీత, ఆర్య వైశ్య చైర్మ‌న్ కాల్వ సుజాత చేతుల మీదుగా బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు.

విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here