ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు పత్రాలను గాంధీకి అందజేసిన కార్పొరేటర్ దొడ్ల

ఓటరు నమోదు పత్రాలను ప్రభుత్వ విప్ గాంధీ కి అందజేస్తున్న దొడ్ల వెంకటేష్ గౌడ్ తదితరులు

ఆల్విన్ కాలనీ(నమస్తే శేరిలింగంపల్లి): టిఆర్ఎస్ పార్టీ ఆదేశాలతో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఓటరు నమోదు వివరాలను స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, ప్రభుత్వ విప్ గాంధీకి అందజేశారు. ఓటరు నమోదు చివరి తేదీనాటికి ఆల్విన్ కాలనీ డివిజన్లో 3160 మంది పట్టభద్రులతో ఓటరు నమోదు చేయించినట్లు వెంకటేష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు డివిజన్ లో ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు. ఇదివరకే 2500 ఓటర్ నమోదు పత్రాలను ఎమ్మెల్యే గాంధీకి అందజేయగా ఆదివారం మరో 660 నమోదు పత్రాలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ యువ నాయకులు రామకృష్ణ గౌడ్ డివిజన్, అధ్యక్షులు జిల్లా గణేష్, సీనియర్ నాయకులు సమ్మారెడ్డి, రామకృష్ణ, సంపత్ రెడ్డి, బతిని వెంకటేష్, కృష్ణగౌడ్, మున్నాభాయ్, జగదీష్, అశోక్ ,వాసు, మల్లేష్, యాదగిరి ,సంగమేష్ ,ప్రదీప్ రెడ్డి, ఫారుక్, మహేష్, ఖలీమ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here