వ‌ర‌ద బాధితుల‌ను ప్ర‌భుత్వం ఆదుకుంటుంది

  • చందాన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

చందాన‌గ‌ర్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వరద ముంపు బాధితులు అధైర్య పడవద్ద‌ని, ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంద‌ని చందాన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అన్నారు. గురువారం ఆమె డివిజ‌న్ ప‌రిధిలోని శివాజీ నగర్ బస్తీ, వేముకుంట బస్తీ, కైలాష్ నగర్ కాలనీ, జవహర్ కాలనీల‌లో వరద ముంపు వల్ల‌ నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అందించిన రూ.10వేల ఆర్థిక స‌హాయాన్ని పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వ‌ర‌ద‌ల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.10వేల తక్షణ సహాయం ప్రకటించ‌డం జ‌రిగింద‌ని, ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామ‌ని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా చందానగర్ డివిజన్ లో ఇటీవల కురిసిన వర్షాల వల్ల ప్రజలు నిరాశ్రయులు అవ్వడంతో వారికి సహాయ సహకారాలు అందించేందుకు, వారికి కలిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here