నమస్తే శేరిలింగంపల్లి: అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బందం కొమ్ము ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న అవంతిక కన్ స్ట్రక్షన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బ్రోచర్ ను ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ, పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, అవంతిక కన్ స్ట్రక్షన్స్ గ్రూప్ ఆప్ కంపెనీ ఎండీ వై. శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, నిర్వాహకులు పాల్గొన్నారు.