నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీఎస్ఎన్ కిరణ్ యాదవ్ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. పెన్సిల్ స్కెచ్‌తో రూపొందించిన ఎంపీ రంజిత్ రెడ్డి చిత్రపటాన్ని కిరణ్ యాదవ్ వారికి అందజేసి సత్కరించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీల సమన్వయంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి పధంలో దూసుకుపోతుందని అన్నారు. వారిరువురికి శేరిలింగంపల్లి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడు తోడుంటాయని అన్నారు.