నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరినగర్లో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మంగళవారం పరిశీలించారు. జిహెచ్ఎంసి సిబ్బంది, డివిజన్ టిఆర్ఎస్ నాయకులతో కలిసి పనులను పర్యవేక్షించిన ఆయన కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్, టిఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి రీ చంద్రిక ప్రసాద్, అశోక్, కాలనీ వాసులు సురపు రాజు, రామరాజు, నారాయణ రావు, రంగారావు, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.