క‌రోన బాధిత కుటుంబాల‌కు అండ‌గా ఉంటాం: ర‌వికుమార్‌యాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: క‌రోనా కార‌ణంగా కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి భార‌తీయ జ‌న‌తాపార్టీ త‌ర‌పున తాము అండ‌గా ఉంటామ‌ని ఆ పార్టీ రాష్ట్ర నాయ‌కులు ఎం.ర‌వికుమార్‌యాద‌వ్ అన్నారు. కోవిడ్ బారిన ప‌డి న‌లుగురు కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోయిన బిహెచ్ఇఎల్ కు చెందిన రాములు కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల‌పై న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి క‌థ‌నం ద్వారా తెలుసుకున్న‌ ర‌వికుమార్‌యాద‌వ్ మంగ‌ళ‌వారం బిజెపి నాయ‌కుల‌తో క‌లిసి వారిని ప‌రామ‌ర్శించారు.

బాధిత కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడుతున్న ర‌వికుమార్‌యాద‌వ్‌

వారికి రెండు నెల‌ల‌కు స‌రిప‌డ నిత్య‌వ‌స‌ర స‌రుకుల‌ను అంద‌జేశారు. అనంత‌రం ర‌వికుమార్‌యాద‌వ్ మాట్లాడుతూ త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి అనాథ‌లుగా మారిన చిన్నారుల‌ను అన్ని విధాల ఆదుకుంటామ‌ని, పిఎం కేర్స్ త‌ర‌పున అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని అందేలా చూస్తామ‌ని తెలిపారు. ఎటువంటి అవ‌స‌ర‌మున్నా త‌న‌ను సంప్ర‌దించాల‌ని ఆయ‌న బాధిత కుటుంబ స‌భ్యుల‌కు సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో శేరిలింగంప‌ల్లి బిజెపి కార్పొరేట‌ర్ కంటెస్టెడ్ అభ్య‌ర్థి ఎల్లేష్ త‌దిత‌రులు ఉన్నారు.

రాములు కుటుంబానికి అంద‌జేసిన నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు

https://fb.watch/6hpX7zz_uw/

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here