కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ కు చెందిన పలువురు నాయకులు తెరాసలో చేరారు. డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి హమీద్ పటేల్ సమక్షంలో సిద్దిక్ నగర్ లోని ఆర్య వైశ్య సంఘం సభ్యులు, ప్రేమ్ నగర్ బి బ్లాక్ వివేకానంద యూత్ సభ్యులు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా వారికి హమీద్ పటేల్ పార్టీ కండువాను కప్పి తెరాసలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెరాసకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని తెలిపారు.