యాదవుల అభివృద్ధికి కృషి చేయాలి.. రఘునాథ్ యాదవ్‌కు బేరి రామచంద్ర యాదవ్ సూచన..

శేరిలింగంప‌ల్లి, మే 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): యాదవ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన మారబోయిన రఘునాథ్ యాదవ్‌ను సంగారెడ్డి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు పెరుగు ఐలేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా స‌న్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని రఘునాథ్ యాదవ్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అలాగే శిరీష రియల్ ఎస్టేట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మారబోయిన రాజు యాదవ్‌ను కూడా యాదవ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బేరి రామచంద్ర యాదవ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన యాదవుల అభివృద్ధికి రఘునాథ్ యాదవ్ కృషి చేయాలని కోరారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో యాదవ యువతను చైతన్య పరిచే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, బీసీ కులాల సంఘాల రాష్ట్ర సలహాదారు పట్లూరి కృష్ణమోహన్, రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ సిరపురం హరికృష్ణ చారి, సంగారెడ్డి జిల్లా జాతీయ బీసీ యువజన విభాగం అధ్యక్షుడు పి. గణేష్ యాదవ్, ఆర్‌సీ పురం మండల్ యాదవ్ మహాసభ అధ్యక్షుడు లకుడారం మల్లేష్ యాదవ్, తెల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు రాగం దేవేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా టీఆర్‌ఎస్ నాయకులు పి. కుమార్ యాదవ్, పి. శ్రీనివాస్ యాదవ్, పి. రాజు యాదవ్, భాషా యాదవ్, ఉమామహేష్ యాదవ్, అనిల్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here