ఓంకార్ నగర్ లో అంగన్ వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి : డీఆర్ఓ కు పల్లె మురళి వినతి

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ఓంకార్ నగర్ లో అంగన్ వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఏఐఎఫ్ డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి విజ్ఞప్తి చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓ హరిప్రియ‌కు వినతి పత్రం అందజేశారు. మియాపూర్ పరిధిలోని ఓంకార్ నగర్ లో గత 30 సంవత్సరాల నుండి నిలువ నీడ లేని నిరుపేదలు, బుడగజంగాలు,సఫాయి కార్మికులు, అట్టడుగు వర్గాల ప్రజలు నివసిస్తున్నారని వారికి సరైన సామాజిక అవగాహన లేక చిన్న చిన్న పిల్లలు చౌరస్తాలా వద్దకు బిక్షమెత్తుకోవడానికి పంపిస్తున్నారని పల్లె మురళి తెలిపారు. కొందరి పిల్లలను పట్టుకొని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇక్కడి పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఓంకార్ నగర్ లో అంగన్ వాడీ కేంద్రాన్ని మంజూరు చేస్తే చిన్నతనం నుండే వారికి పాఠశాల వాతావరణం అలవాటుపడి శ్రద్ధగా చదువుకునే అవకాశం ఉంటుందన్నారు. వెంటనే ఓంకార్ నగర్ లో అంగన్ వాడి సెంటర్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

డీఆర్ఓకు వినతి పత్రం అందజేస్తున్న ఏఐఎఫ్ డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here