నమస్తే శేరిలింగంపల్లి: పేద ప్రజల ఆరాధ్య దైవం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పీజేఆర్ సేవలు ఎన్నడూ మరవలేనివని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ 137 వ ఆవిర్భావ దినోత్సవాన్ని, పీజేఆర్ 14 వ వర్థంతి వేడుకలను చందానగర్ లో కాంగ్రెస్ నాయకులు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, పేదల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పీజేఆర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిపాల్ యాదవ్, రఘునందన్ రెడ్డి, ఇలియాస్ షరీఫ్, సురేష్ నాయక్, పోచయ్య, రాజేందర్, రెవెల్లి రాజేష్, జావీద్ ఉస్సేన్, జహంగీర్, అజింఖాన్, హరికిషన్, ప్రవీణ్ యాదవ్, శామ్యూల్ కార్తీక్ యువజన కాంగ్రెస్ నాయకులు సౌందర్య రాజన్, శ్రీహరి గౌడ్, మందుల సైదులు, నరేందర్, ఖాజా, సాయి కిషోర్, తదితరులు పాల్గొన్నారు.