నమస్తే శేరిలింగంపల్లి: ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో సోమవారం ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ భాగస్వామ్యులయ్యారు. స్థానికంగ టీఆర్‌స్ పార్టీ బలపరచిన అభ్యర్థుల గెలుపుకు మద్దతుగా ఆయన సోమవారం ప్రచారం నిర్వహించారు. సమర్ధవంతమైన పాలన కోసం టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని, అదేబాటలో ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధి చెందాలంట టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని గాంధీ స్థానిక ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, హైదర్‌నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.