ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): దీపావళి పర్వదిన వేళ నిరుపేద చిన్నారుల ముఖాల్లో వెలుగులు తీసుకొచ్చింది అవణి స్వచ్ఛంద సంస్థ. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి మహంకాళి నగర్ లోని నిరుపేద చిన్నారులకు అవణి వ్యవస్థాపకురాలు శిరీష సత్తూర్ శుక్రవారం ఆట సైకిళ్లను అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోన విజృంభన కొనసాగుతున్న ప్రస్తుత సమయంలో చిన్నారులను టపాసులకు దూరంగా ఉంచుతూనే వారి కళ్ళల్లో ఆనందాన్ని చూసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అన్నారు. ఈ క్రమంలోనే మహంకాళి నగర్ లోని నిరుపేద చిన్నారులకు సైకిళ్లను ఉచితంగా అందజేయడం జరిగిందని అన్నారు. పిల్లల ముఖాల్లో కనిపించిన సతోషం తనకెంతో సంతృప్తినిచ్చిందని శిరీష సత్తూర్ పేర్కొన్నారు.