దుబ్బాక (నమస్తే శేరిలింగంపల్లి): దుబ్బాకలో జరగనున్న ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ఆ పార్టీ శేరిలింగంపల్లి ఇన్చార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ దుబ్బాక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం ఖాయమని అన్నారు. ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంగల రాధాకృష్ణ యాదవ్, గంగాధర్ రెడ్డి, ఎల్లేష్, నాగరాజు యాదవ్, ప్రసాద్ పాల్గొన్నారు.