నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని భవానిపురం కాలనీ గణపతి నవరాత్రులు ఘనంగా ముగిశాయి. ఈ క్రమంలో నిమజ్జనానికి ముందు గణేష్ లడ్డూను వేలం పాట వేయగా.. రూ.1 లక్ష 2వేలకు కాలనీవాసి అన్నపురెడ్డి లక్ష్మీ రెడ్డి కైవసం చేసుకున్నారు. ఉత్సవ కమిటి సభ్యులు లడ్డును ఊరేగింపుగా తరలించి లక్ష్మీ రెడ్డి కుటుంబ సభ్యులకు అప్పగించి ఘనంగా సత్కరించారు.