శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): ఆక్స్‌ఫర్డ్ స్కూల్ లో శనివారం బతుకమ్మ , దసరా పండుగ సంబరాలను నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులను ధరించి బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. విద్యార్థులు రకరకాల పూలు తీసుకుని వచ్చి బతుకమ్మను తయారు చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ మాలిని, నర్సీన్, ప్రశాంతి, స్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






