ఉక్రెయిన్ నుంచి క్షేమంగా వచ్చిన హఫీజ్ పేట వాసి – పరామర్శించిన కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: ఉక్రెయిన్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులను‌ క్షేమంగా తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం‌ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ క్షేమంగా వచ్చేలా‌ కృషి చేస్తున్నారని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హఫీజ్ పేట డివిజన్ ప్రజయ్ సిటీకి చెంది‌న సాయిరాం ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ గురువారం హాఫీజ్ పెట్ డివిజన్ ప్రజయ్ సిటీలోని తన ఇంటికి చేరుకున్న సాయి రామ్ ను పరామర్శించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో వారు అక్కడ ఎదుర్కొన్న సమస్యలను, అక్కడి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న విద్యార్థులను భారత్ దేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఉక్రెయిన్ నుంచి దేశానికి విద్యార్థులు క్షేమంగా వస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్.జి.రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని విద్యార్థుల విషయంలో సమాచారం అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు.

ఉక్రెయిన్ నుంచి క్షేమంగా ఇంటికి వచ్చిన హఫీజ్ పేట వాసి సాయిరాంను పరామర్శిస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here