శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, తెరాస నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయాభిలాషులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ 2021 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కొత్త సంవత్సరంలో వారికి విజయాలు కలగాలని, వారు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 2021లో కరోనా మహమ్మారి ప్రజల జీవితాల నుంచి పూర్తిగా తొలగిపోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలో ప్రజలు చేపట్టబోయే ప్రతి కార్యంలోనూ వారికి విజయం సిద్ధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. ప్రజలకు ఆయన ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.