శేరిలింగంపల్లి, నవంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు బొల్లేపల్లి సీతారామరాజు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు వానిపల్లి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన టి. శ్రీనివాస్ యాదవ్‌కు జిల్లా కార్యదర్శిగా నియామక పత్రాన్ని అందజేశారు.

సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. ఓబీసీల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పనిచేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు. బీజేపీని మరింత బలోపేతం చేయడంతోపాటు బీసీ వర్గాల అభ్యున్నతి కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్, హఫీజ్‌పేట్ డివిజన్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్‌లకు నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.





